Site icon NTV Telugu

YSRCP Counter : పవన్‌ యాక్షన్‌.. వైసీపీ రియాక్షన్‌..

YSRCP Digital Team Counter to Janasena Party Chief Pawan Kalyan.

జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జనసేన భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. 8 వసంతాలు పూర్తి చేసుకుని 9వ వసంతంలోకి అడుగు పెడుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళగిరి సమీపంలోని ఇప్పటంలో భారీ బహిరంగ సభ కొనసాగుతుంది. ఈ సందర్భంగా జనసేనాని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీఎం క్యాంపు కార్యాల‌యానికి కూత వేటు దూరంలోనే జనసేన ఆవిర్భవ సభను ఏర్పాటు చేసిన జ‌న‌సేనాని.. అధికార వైసీపీపై ప‌వ‌ర్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పవన్‌ స్ట్రాటజీ గురించి తెలిసిందో ఏమో తెలియదు కానీ.. వైసీపీ డిజిటల్‌ టీమ్‌ రంగంలోకి దిగిపోయింది. ఇంకేముంది ఆవిర్భవ సభలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ పవన్‌ ప్రశ్నలు సంధిస్తుంటే.. డిజిటల్‌ టీం ట్విట్టర్‌ వేదికగా సమాధానాలు ఇస్తూ కౌంటర్‌లు వేయడం విశేషం. అయితే దీనికి సంబంధించిన ట్విట్‌లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వాటిని మీరూ చూసేయండి..

Exit mobile version