Site icon NTV Telugu

బద్వేల్‌ లో వైసీపీ గ్రాండ్‌ విక్టరీ !

కడప : బద్వేల్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ గ్రాండ్‌ విక్టరీ సాధించింది. ఏకంగా… 90, 228 ఓట్ల తో భారీ మెజారిటీతో గెలుపొందారు వైసిపి అబ్యర్ధి సుధా. 12 వ రౌండు పూర్తయ్యే సరికి 1,46,546 ఓట్లు కౌంట్ చేశారు ఎన్నికల అధికారులు. ఇక ఈ 12 వ రౌండ్‌ ముగిసే సరికి వైసీపీ అభ్యర్థిని సుధాకు వచ్చిన మొత్తం 1,11, 710 ఓట్లు వచ్చాయి. అలాగే… బీజేపీ అభ్యర్థి సురేష్‌కు.. 21,621 ఓట్లు పోల్‌ అయ్యాయి.

కాంగ్రెస్ అభ్యర్ధి కమలమ్మ కు 6205 ఓట్లు వచ్చాయి. 12 వ రౌండు ముగిసే సరికి మొత్తం నోటా కు 3635 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ పార్టీ విజయం అనివార్యం అయింది. మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలు నమోదు చేస్తున్న వైసీపీ… లక్ష మెజార్టీ దిశగా దూసుకుపోతుంది. దీంతో తాడేపల్లి వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఉత్సాహం మిన్నంటింది. ఇక ఈ విజయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Exit mobile version