NTV Telugu Site icon

YS Jagan: రైతులను పట్టించుకోరా..? ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి..

Jagan

Jagan

YS Jagan: ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించిన ఆయన.. అకాల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించారు.. పంట నష్టపోయిన రైతులను పరామర్శించి ధైర్యాన్ని చెప్పారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షం, వడగళ్ల, గాలికి 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. పార్ణపల్లె, ఏగువపల్లె, కోమటీనూతల, తాతిరెడ్డిపల్లి గ్రామాల్లో 4000 ఎకరాల్లో వర్షానికి అరటి పంటలు దెబ్బతిన్నాయి.. దాదాపుగా రైతన్నలు 15 లక్షలు చొప్పున నష్ట పోయారని పేర్కొన్నారు.. అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్‌ అయ్యారు.. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు..

Read Also: Ananya : బాలీవుడ్‌లో‌ మరో బ్రేకప్.. బాయ్ ఫ్రెండ్ ఫొటోల్ని తగలబెట్టిన హీరోయిన్

అయితే, 2024 ఖరీఫ్ ప్రీమియంను చంద్రబాబు కట్టేందుకు మేం ప్రయత్నిస్తున్నాం అన్నారు వైఎస్‌ జగన్‌.. ఈ క్రాఫ్ కింద ఉచిత పంటల బీమా ఉందా లేదా ? అని ప్రశ్నించిన ఆయన.. చంద్రబాబు నాయుడు పుణ్యాన ఖరీఫ్ లో పంట నష్టం చూశాం.. వెంటనే ప్రభుత్వం మనవతాదృక్పదంతో స్పందించాలి.. వర్షం వల్ల నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని.. రైతు భరోసా కింద రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.. సున్నా వడ్డీని ఎత్తేశారని ఆరోపించారు.. రాష్ట్రంలో పులివెందుల అరటి సాగుకు నెంబర్ వన్.. ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ మా ప్రభుత్వంలో నిర్మించాం.. కానీ, యూజర్ ఏ జెన్సీని ఎంపిక చేయడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని దుయ్యబట్టారు. మా ప్రభుత్వ హయాంలో అరటిని ఎక్స్‌పోర్ట్‌ చేశాం.. నెల క్రితం 26 వేలు పలికిన అరటిని ప్రస్తుతం అడిగేవారు లేరు.. రాష్ట్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదు.. మిర్చి, శనగలు, మినుములు.. ఇలా ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని విమర్శించారు.. 4000 ఎకరాల అరటి రైతులకు మేం అండగా ఉంటామని హామీ ఇస్తున్నా.. ఇన్సూరెన్స్ వచ్చేలా కృషి చేస్తా అన్నారు వైఎస్‌ జగన్..