NTV Telugu Site icon

YS Jagan Christmas Celebration: పులివెందులలో క్రిస్మస్ వేడుకలు.. పాల్గొన్న వైఎస్‌ జగన్‌

Jagan

Jagan

YS Jagan Christmas Celebration: కడప జిల్లా పర్యటనలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు.. పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో ఘనంగా క్రిస్మస్‌ వేడులు నిర్వహించారు.. ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌, భారతి దంపతులతో పాటు వైఎస్‌ విజయమ్మ.. వైఎస్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఉదయం 8.45 గంటల నుండి 11 గంటల వరకు తల్లి వైయస్‌ విజయలక్ష్మి, సతీమణి భారతి, వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు వైఎస్‌ జగన్‌.. కుటుంబ సభ్యులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు..

Read Also: Arvind Kejriwal News: అతిషీని కూడా అరెస్టు చేయవచ్చు, బీజేపీకి సీఎం నాయకుడు లేదు : అరవింద్ కేజ్రీవాల్

ఇక, నిత్యం బిజీగా ఉంటే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అక్కడ మాత్రం పిల్లలతో సరదాగా గడిపారు. క్రిస్మస్ ప్రార్థనలలో సందర్భంగా పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో ఈ దృశ్యం చోటుచేసుకుంది.. క్రిస్మస్ ప్రార్థనలలో పాల్గొనడానికి చర్చికి వచ్చిన చిన్న పిల్లలు జగన్ ని చూసేందుకు ఎగబడ్డారు.. దగ్గరికి వెళ్లడానికి భయపడుతూ జంకుతున్న పసిపిల్లలను ఆయన ప్రేమగా దగ్గరికి రావాలని సైగ చేశారు. అయితే ఆయన వారి పట్ల ప్రేమగా వాత్సల్యంతో దగ్గరికి తీసుకొని సరదాగా ముచ్చటించారు.. తన పక్కన కూర్చోబెట్టుకొని ఆ పిల్లలతో తాను పసిపిల్లవాడై వ్యవహరించాడు.. ఆ దృశ్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.. ఇక, ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ సత్య పథం వైపు నడవాలని , కరుణామయుని ఆశీస్సులు అందరికీ అందాలని ఆకాక్షించారు.. ఈ కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌, భారతి, విజయమ్మ వారి కుటుంబ సభ్యులతో పాటు.. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌ రెడ్డి, అంజాద్‌ భాష, కోరుముట్ల శ్రీనివాసులు, వైఎస్‌ ప్రకాష్‌ రెడ్డి, వైఎస్‌ మనోహర్‌ రెడ్డి , వైఎస్‌ మదన్‌ మోహన్‌ రెడ్డి, వైఎస్‌ ప్రతాపరెడ్డి.. పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా 2025 క్యాలెండర్‌ను కూడా ఆవిష్కరించారు వైఎస్‌ జగన్..

 

 

 

 

 

Show comments