Gandikota Crime: కడప జిల్లాలో మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో సెల్ ఫోన్ టవర్ డంప్స్ ద్వారా పోలీసులు విచారణ మొదలు పెట్టారు. ఇప్పటి వరకు దాదాపు 10 టవర్ డంప్స్ ను తెప్పించుకొని ఆ రోజు గండికోట ప్రాంతంలో ఏఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెల్ టవర్ డంప్స్ అనేది గూగుల్ టేక్ అవుట్ ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక, ఒక్కొక్క టవర్ డంప్స్ కు ఒక్కో ఎస్ఐ ద్వారా విచారణ చేసేలా చర్యలు చేపట్టారు. అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
Read Also: Gold Rates: అమ్మబాబోయ్.. చుక్కలు చూపిస్తున్న బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే వేలల్లో!
అయితే, నిందితుల కోసం నలుగురు డిఎస్పీలు,10 మంది సీఐలు, 10 మంది ఎస్ఐలు, 50 మంది కానిస్టేబుళ్లు,18 బృందాలుగా గాలింపు చేస్తున్నాయి. ఇక, గత మూడు రోజులగా జమ్మలమడుగులోనే ఎస్పీ అశోక్ కుమార్ మకాం వేశారు. గండికోటలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని మరి గాలింపు చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
