Site icon NTV Telugu

Ravindranath Reddy: ఏపీలో అవినీతి రాజ్యమేలుతోంది

Ravindranath Reddy

Ravindranath Reddy

ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి రాజ్యమేలుతోందని వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కడపలో ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అవినీతి చక్రవర్తి చంద్రబాబు అన్నారు. లక్షల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులు ఉన్న ఏకైక సీఎం చంద్రబాబు అని తెలిపారు, ప్రస్తుతం బ్రిటిష్ పాలన కంటే దారుణమైన పాలన రాష్ట్రంలో సాగుతుందని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Tirupati: గూడూరు హత్య కేసులో మరో లేడీ డాన్ పాత్ర.. ఈమె దందా ప్రత్యేకత ఇదే!

ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనతో ప్రతి జిల్లాల్లో గత వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మించిందని.. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని మాజీ సీఎం జగన్ గొప్ప ఆలోచన చేశారని తెలిపారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం దారుణం అని వాపోయారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటానికి సిద్ధపడుతున్నట్లు ప్రకటించారు. పేద ప్రజలకు మంచి చేసేందుకు ఎప్పుడూ ముందుంటామని ప్రకటించారు. ప్రైవేటీకరణ చేయడం వల్ల పేద విద్యార్థులు మెడికల్ విద్య చదివేందుకు వీలు ఉండదని చెప్పారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు అయ్యాయంటూ విజయోత్సవ సభ పెట్టడం సిగ్గు చేటు అన్నారు. ప్రజలను మభ్య పెట్టడం చంద్రబాబు మానుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి: Bengaluru Video: బస్సులో కొట్టుకున్న డ్రైవర్‌-మహిళా ప్రయిణికురాలు.. ఏం జరిగిందంటే..!

Exit mobile version