YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..
- వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం..
- తొలి దర్యాప్తు అధికారి, అప్పటి సీఐ శంకరయ్య డిస్మిస్..
- వివేకా హత్య సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన శంకరయ్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె. శంకరయ్యను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు, ప్రస్తుతం కర్నూలు జిల్లా వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్యను డిస్మిస్ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Karnataka High Court: ద్విచక్ర వాహనాలపై పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
Also Read
సీఐ శంకరయ్య ప్రవర్తన, నిబంధనల ఉల్లంఘన, శాఖ క్రమశిక్షణకు భంగం కలిగించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇటీవల సీఐ శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపిస్తూ, రూ. 1.45 కోట్ల పరువు నష్టం పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఆ అవకాశాన్ని నిరాకరించడం అన్యాయమని పేర్కొంటూ, హైకోర్టులో కూడా ఆయన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. అయితే, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తూ తొలి విచారణ చేపట్టిన అధికారి శంకరయ్య. అప్పటినుంచి ఆయన పాత్ర, కేసు నిర్వహణపై పలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. ఈ నేపథ్యంలో శంకరయ్యను డిస్మిస్ చేయడం ఆసక్తికరంగా మారింది..
తాజావార్తలు
-
Fake Shopping Offers : రూ.999 ఆఫర్.. ఖాతా ఖాళీ.! సైబర్ మోసగాళ్ల కొత్త ట్రిక్
-
OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్
-
OTR: ఎమ్మెల్యే మాధవి వైఖరి మిగతా ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారిందా?
-
Train: మరీ చీఫ్‌గా దుప్పట్లు చోరీ.. కోచ్ అటెండెంట్లు గగ్గోలు.. ఎందుకంటే..!
-
ITR Filing: కొత్త ట్యాక్స్ విధానమే బెస్ట్? పాత విధానం ఎవరికి లాభం.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!