Site icon NTV Telugu

YS Viveka Murder Case: వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. తొలి దర్యాప్తు అధికారి డిస్మిస్..

Ys Viveka

Ys Viveka

YS Viveka Murder Case: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. వివేకానంద హత్య కేసులో తొలి దర్యాప్తు అధికారి, సీఐ శంకరయ్యను డిస్మిస్ చేశారు పోలీసులు ఉన్నతాధికారులు.. ఎన్నో మలుపులు తీసుకున్న వివేకానంద రెడ్డి హత్యకేసులో తొలి దర్యాప్తు అధికారి, పులివెందుల మాజీ సీఐ జె. శంకరయ్యను సర్వీస్‌ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కర్నూలు రేంజ్‌ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు, ప్రస్తుతం కర్నూలు జిల్లా వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న సీఐ శంకరయ్యను డిస్మిస్ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

Read Also: Karnataka High Court: ద్విచక్ర వాహనాలపై పిల్లలకు హెల్మెట్ తప్పనిసరి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

సీఐ శంకరయ్య ప్రవర్తన, నిబంధనల ఉల్లంఘన, శాఖ క్రమశిక్షణకు భంగం కలిగించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ఇటీవల సీఐ శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలతో తన ప్రతిష్ట దెబ్బతిందని ఆరోపిస్తూ, రూ. 1.45 కోట్ల పరువు నష్టం పరిహారం డిమాండ్ చేస్తూ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. వైఎస్‌ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారని, ఇప్పుడు ఆ అవకాశాన్ని నిరాకరించడం అన్యాయమని పేర్కొంటూ, హైకోర్టులో కూడా ఆయన న్యాయపోరాటం కొనసాగిస్తున్నారు. అయితే, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పనిచేస్తూ తొలి విచారణ చేపట్టిన అధికారి శంకరయ్య. అప్పటినుంచి ఆయన పాత్ర, కేసు నిర్వహణపై పలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తం అయ్యాయి.. ఈ నేపథ్యంలో శంకరయ్యను డిస్మిస్‌ చేయడం ఆసక్తికరంగా మారింది..

Exit mobile version