NTV Telugu Site icon

వైఎస్‌ వివేకా హత్య కేసు: దూకుడు పెంచిన సీబీఐ

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. 58వ రోజు సీబీఐ విచారణ వేగంగా కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. విచారణకు వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరి హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిన్న కీలక పరిణామం చోటుచేసుకుంది. వైయస్ వివేకానంద రెడ్డి హత్య అనుమానితుడు పులివెందులకు చెందిన సునీల్‌ కుమార్‌ యాదవ్‌ను గోవాలో సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు సీబీఐ కేంద్ర కార్యాలయం అధికారులు ధ్రువీకరించారు. సునీల్ యాదవ్​ను కడప కోర్టులో సీబీఐ అధికారులు బుధవారం హాజరుపర్చనున్నారు.