భార్యాభర్తలు అన్నాకా గొడవలు సహజం.. ఆ గొడవల వలన ఎడబాటు సాధారణం. భార్య పుట్టింటికి వెళ్లడం, లాగడం , మళ్లీ భర్త ఇంటికి తీసుకురావడం ప్రతి ఒక్కరి కాపురంలో జరిగేవే.. కానీ, కొంతమంది మాత్రం ఇలాంటి చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను వదిలేస్తున్నారు. తాజాగా భర్త తనను కాపురానికి తీసుకువెళ్లడంలేదని ఒక భార్య ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. కర్ణాటకకు చెందిన చందునాయక్ కి మదనపల్లెకు చెందిన రమ్యశ్రీకి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 11 నెలల కుమారుడు ఉన్నాడు. మొదట్లో సజావుగా సాగిన వీరి కాపురంలో కలతలు రేగాయి. భార్యాభర్తల మధ్య తరుచు గొడవలు అవుతున్నాయి. దీంతో భర్తపై అలిగిన రమ్యశ్రీ పిల్లాడిని తీసుకొని పుట్టింటికి వచ్చేసింది. ఇక కొన్నిరోజుల తరువాత అలక తగ్గడంతో భర్తకు ఫోన్ చేసి కాపురానికి తీసుకెళ్లామని కోరింది. అయినా భర్త ఆమె మాటను పట్టించుకోలేదు.
ఇలాగే రెండు, మూడు రోజుల నుంచి భర్త కాపురానికి తీసుకెళ్ళడంలేదని ఆవేదన చెందిన రమ్య శుక్రవారం మరోసారి భర్తకు వీడియో కాల్ చేసి రమమ్ని పిలిచింది. అప్పుడు కూడా చందు నాయక్ ఏమి మాట్లాడకపోయేసరికి తాను ఉరేసుకుంటానున్నాని బెదిరించింది. ఆమె ఊరికే బెదిరిస్తున్నదనుకొని భర్త ఫోన్ కట్ చేశాడు. దీంతో మనస్థాపానికి గురైన రమ్య ఫ్యాన్ కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇదే విషయాన్ని చందు, తన అత్తగారికి ఫోన్ చేసి చెప్పడంతో ఉరుకులుపరుగుల మీద ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్ కి వేలాడుతూ రమ్య కనిపించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.