NTV Telugu Site icon

కీసర బ్రిడ్జిపై నుంచి దూకిన మాజీ మిస్ తెలంగాణ

కృష్ణాజిల్లా కంచికచర్ల మండలంలో ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. కీసర బ్రిడ్జి పై నుంచి నీటిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా యువతి. ద్విచక్ర వాహనంపై వచ్చి బ్రిడ్జి పైన వాహనాన్ని నిలిపింది. అనంతరం నది నీటిలోకి దూకింది యువతి. ఈ విషయం గమనించి రక్షించారు స్థానిక యువకులు.

అనంతరం 108 వాహనంలో నందిగామ ఏరియా ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి వుంది. స్థానికులు సకాలంలో స్పందించడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. యువతి వివరాలను ఆరా తీస్తున్నారు పోలీసులు.

ఆత్మహత్యకు పాల్పడింది మాజీ మిస్ హాసినిగా గుర్తించారు. తాజాగా నందిగామ కీసర దగ్గర మున్నేరు వాగులోకి దూకేందుకు ప్రయత్నించింది. ఆమెను స్థానికులు, పోలీసులు రక్షించారు. ఇలా హాసిని ఆత్మహత్యాయత్నం చేయడం రెండవసారి. రెండు రోజుల క్రితం నారాయణగూడలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది హాసిని. ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్లో ఆత్మహత్య యత్నం చేస్తూ టెలికాస్ట్ చేసింది హాసిని. పోలీసులు ఆమెని రక్షించారు. మళ్ళీ ఇబ్రహీం పట్నం దగ్గర నదిలో దూకింది హాసిని. కొన్నాళ్ళ క్రితం తనపై అత్యాచారం చేశారంటూ బంజారాహిల్స్ లో ఫిర్యాదు చేసింది హాసిని.