YSRCP Annadata Poru: ఇవాళ (సెప్టెంబర్ 9న) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. రైతులు, రైతు సంఘాలతో కలిసి అన్ని జిల్లాల్లోని ఆర్డీవో కార్యాలయాల ఎదుట నిరసనలు చేయాలని కోరింది. రాష్ట్రంలో యూరియా కొరత లేకుండా చూడాలనీ, ఉల్లి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేస్తుంది.
Read Also: French: ఫ్రెంచ్‌లో రాజకీయ సంక్షోభం.. విశ్వాస పరీక్షలో ప్రధాని ఫ్రాంకోయిస్ బేరో ఓటమి
అలాగే, ఈ నిరసన ప్రదర్శనల అనంతరం ఆర్డీవోలకు వినతి పత్రాలు అందించాలని వైసీపీ నిర్ణయించింది. ఇక, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 30 యాక్ట్ అమలులో ఉన్నందున నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ వైసీపీ నేతలను హౌస్ అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినా అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని వైసీపీ శ్రేణులు తేల్చి చెప్పారు.
