Site icon NTV Telugu

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ను కలిసిన వైసీపీ ఎంపీల బృందం…

వైసీపీ కాంగ్రెస్ ఎంపీల బృందం కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజును కలిశారు. ఈ ఎంపీల బృందం లో విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, బెల్లాన చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. అనర్హత పిటిషన్ల పై నిర్ణీత గడువు లోపల నిర్ణయం తీసుకోవాలి. పదో షెడ్యూల్ ను ఈ మేరకు సవరించాలని వినతి. ఏపీ హైకోర్టు ను కర్నూలు కు తరలించాలి. కర్నూల్లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసారు. అలాగే “జాతీయ జ్యుడిషియల్ కమిషన్” ను ఏర్పాటు చేయాలి. ఎస్సీ కమిషన్ తరహాలో రాజ్యాంగబద్ధమైన “జాతీయ రైతుల కమిషన్” ను ఏర్పాటు చేయాలి అని లేఖలో విజ్ఞప్తి చేసారు వైసీపీ కాంగ్రెస్ ఎంపీలు.

Exit mobile version