NTV Telugu Site icon

నవరత్నాల ఆలయం.. తల్లిదండ్రులు, భార్యా పిల్లల కన్నా జగనే ముఖ్యం

తిరుపతిలోని శ్రీకాళహస్తి పట్టణ శివారులో ‘జగనన్న నవరత్నాలు గుడి’ పేరిట ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఓ ఆలయ నిర్మాణం చేశారు. సీఎం జగన్ చేపట్టిన నవరత్నాల గురించి వివరిస్తూ వినూత్న రీతిలో ఎమ్మెల్యే ఈ గుడి నిర్మాణం చేపట్టారు. జగనన్న ఇళ్లు పథకం కింద రెండు వేల మంది లబ్ధిదారులకు ప్లాట్లు కేటాయించిన స్థలంలోనే ఎమ్మెల్యే గుడి నిర్మించారు.

రేపు జిల్లా మంత్రుల చేతుల మీదుగా నవరత్నాల గుడి ప్రారంభోత్సవం సందర్బంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడారు. ‘జగన్ అన్న అంటే నాకు విపరీతమైన అభిమానం.. తల్లిదండ్రులు, భార్యా పిల్లల కన్నా నాకు జగనే ముఖ్యం. రాముడికి హనుమంతుడు ఎలాగో జగన్ కు నేను అలాగే అన్నారు. మొదటిసారి ఓడిపోయిన నాకు మళ్ళీ టికెట్ ఇచ్చి జగనన్న గెలిపించాడు. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకునే అందుకే ఈ నవరత్నాల ఆలయం నిర్మించాను’ అని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు.