Site icon NTV Telugu

ఏపీ సర్కార్ పై యనమల ఫైర్.. వైసీపీది చెత్త పాలన !

అమరావతి : వైసీపీ సర్కార్‌ పై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల నిప్పులు చెరిగారు. ప్రజల పై చెత్త పన్ను వేస్తూ చెత్త పాలన కు శ్రీకారం చుట్టారని జగన్‌ సర్కార్‌ పై ఫైర్‌ అయ్యారు. హింస కు, దౌర్జన్యాలే లక్ష్యంగా జగన్ పాలన సాగుతోందన్నారు. స్వేచ్ఛ ను హరిస్తూ స్వచ్ఛ సంకల్పం నిర్వహణ హాస్యాస్పదమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీజీ ఫోటో పక్కన.. జగన్ బొమ్మ పెట్టడం జాతి పితను అవమానించడమేనని తెలిపారు.. కమిషన్ల కోసమే చెత్తవాహనాలు కొనుగోలు తప్ప.. ప్రజా క్షేమం కోసం కాదని ఫైర్‌ అయ్యారు. గాంధీ జయంతికి ముందు రోజు.. మద్యం పాలసీ పేరుతో రాష్ట్రంలో మద్యం వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టారని నిప్పులు చెరిగారు యనమల.

Exit mobile version