Site icon NTV Telugu

గుంటూరులో దారుణం : పురుగుల మందు తగిన ఎస్ఐ, కానిస్టేబుల్

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని చుండూరు ఎస్సై శ్రావణి, కానిస్టేబుల్ రవీంద్ర ఆత్మహత్యాయత్నం చేశారు. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. సకాలంలో వారిని ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారు చికిత్స పొందుతున్నారు. అసత్య ప్రచారాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ఘటనపై చుండూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎస్సై శ్రావణి స్వస్థలం ప్రకాశం జిల్లా కాగా.. కానిస్టేబుల్ రవీంద్రది గుంటూరు జిల్లా కర్లపాలెం. ఒకే పోలీసు స్టేషన్ లో పనిచేస్తుండటంతో వల్ల ఇద్దరిపై పుకార్లు రావడమే దీనికి కారణమని అనుమనిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version