NTV Telugu Site icon

Extramarital Affair: భర్తని వదిలి ఫోన్‌లో పరిచయమైన వ్యక్తితో సహజీవనం.. ఆ తర్వాత?

Eluru Affair Crime News

Eluru Affair Crime News

Woman Killed By Lover In Eluru District: వివాహేతర సంబంధాలు పచ్చిన కాపురాల్లో చిచ్చు రేపుతున్నాయి. మనుషులతో నేరాలు కూడా చేయిస్తున్నాయి. అడ్డుగా ఉన్నారనో భర్తల్ని, పరాయి వ్యక్తితో సంబంధం పెట్టుకున్నారన్న కోపంతో భార్యల్ని చంపేస్తున్నారు. కొందరు ప్రేమించిన వ్యక్తులే తమ హతమార్చుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలోనూ అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. భర్తని వదిలి ఓ వ్యక్తితో సహజీవనం చేస్తున్న ఒక మహిళ.. విగతజీవిగా కనిపించింది. ఎవరు హతమార్చారని విచారణ చేస్తే.. సహజీవనం చేస్తున్న వ్యక్తే చంపినట్లు తేలింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Sudigali Sudheer: ‘జబర్దస్త్’ కెవ్వు కార్తీక్ పెళ్లి.. ట్రెండ్ అవుతున్న సుధీర్

ఏలూరు జిల్లాలోని నూజివీడు పట్టణం ఎంఆర్ అప్పారావు కాలనీలో నివాసముంటున్న హైమావతి (24) అనే మహిళకు కొంతకాలం క్రితం ఓ వ్యక్తితో పెళ్లి అయ్యింది. మొదట్లో వీరి సంసార జీవితం సాఫీగానే సాగింది. కానీ.. ఆ తర్వాత హైమావతి దారి తప్పింది. అనునిత్యం ఫోన్‌తోనే కాలం గడిపే ఆమెకు.. గరికే కోటయ్య అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. వీళ్లు చాటింగ్ చేసుకోవడం, ఆ తర్వాత బయట కూడా కలవడంతో.. సాన్నిహిత్యం పెరిగింది. అతనికి ఆకర్షితురాలైన హైమావతి.. తన భర్తను వదిలి, కోటయ్యతో సహజీవనం చేయసాగింది. కొన్నాళ్లు వీళ్లు హ్యాపీగానే తమ జీవితాన్ని లీడ్ చేశారు. వీరికి పిల్లలు కూడా పుట్టారు. కానీ.. వీరి మధ్య కూడా విభేదాలు మొదలయ్యాయి.

Gujarat News : భార్యను బట్టలిప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. ఎందుకంటే

హైమావతి తరచూ ఫోన్‌లోనే ఉండటంతో.. కోటయ్యకు ఆమెపై అనుమానం పెరిగింది. రానురాను ఈ అనుమానం పెనుభూతంగా మారింది. వీరిద్దరి మధ్య రెగ్యులర్‌గా గొడవలు అయ్యాయి. ఈ క్రమంలోనే ఓసారి కోటయ్యకు కోసం నషాళానికెక్కి.. కర్రతో కొట్టి హైమావతిని చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కోటయ్యను అదుపులోకి తీసుకున్నారు.