Site icon NTV Telugu

Nitin Gadkari: సముద్రంలోకి వెళ్లే నీటిపై గొడవలు ఎందుకు..?

Gadkari

Gadkari

Nitin Gadkari: ఏపీలో కేంద్ర రోడ్లు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రూ.5,233 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇక, కేంద్రమంత్రి మాట్లాడుతూ.. దేశ ప్రగతిలో నీరు, విద్యుత్‌, రవాణా, కమ్యూనికేషన్‌ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. అయితే, ఏపీ అభివృద్ధిలో నౌకాయాన శాఖ కీ రోల్ పోషిస్తోందన్నారు. షిప్పింగ్‌, పోర్టులు, రోడ్లు అభివృద్ధి చెందితే దేశం కూడా వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

Read Also: Meat: ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు.. గొర్రె మాంసం కొంటలేరని.. మేక తోక అంటించి..

ఇక, తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీటి వివాదంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. సముద్రంలోకి వెళ్లే నీటిపై గొడవలు ఎందుకు అని ప్రశ్నించారు. ఏటా 1400 టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృథాగా వెళ్తోంది.. నీటిని ఒడిసిపట్టే ప్రయత్నం చేయడం లేదు.. కానీ, ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇరువురు కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని గడ్కరీ సూచించారు.

Exit mobile version