నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ప్రసంగంత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై 5 రోజులపాటు చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 7న ప్రధాని మోడీ సమాధానం, కరోనా దృష్యా వేర్వేరు సమయాల్లో ఉభయ సభలు సమావేశాలు నిర్వహించనున్నారు. రాజ్యసభ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జరుగనుంది. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లోక్ సభ జరుగనుంది.
నేడు డ్రగ్స్ కేసులో టోనీని మూడో రోజు పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు ఈ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే ప్రస్తుతం టోనీని 5 రోజుల కస్టడీకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొందరు బడా బాబుల పేర్లు బయటపడే అవకాశం ఉంది.
పార్లమెంట్ లో నిరసన తెలపాలని టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణకు పిలుపునిచ్చింది. రేపటి నుంచి టీఆర్ఎస్ ఎంపీలు సమావేశాలకు హాజరుకానున్నారు.
నేడు అఖిలపక్షం నేతలతో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భేటీ కానున్నారు. సాయంత్రం వర్చువల్ గా వెంకయ్య నాయుడు అఖిలపక్షం నేతలతో భేటీ అవుతారు.