Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ క్లబ్‌లో సమావేశం కానున్నారు. సమావేశానికి హజరుకావాలని 240 మంది సభ్యులకు ఆహ్వానం పంపించారు. సీఎం జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ తర్వాత తొలిసారి సమావేశం కానున్నారు.
  2. నేడు సీఎం కేసీఆర్‌ ముంబైకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రేతో సీఎం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను సీఎం కేసీఆర్‌ కలువనున్నారు. ఇద్దరు నేతలతో జాతీయ రాజకీయాలపై కేసీఆర్‌ చర్చించనున్నారు.
  3. నేడు ఉత్తర్‌ ప్రదేశ్‌లో మూడవ విడత అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. యూపీలో 3వ విడుతలో 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. మూడో విడతలో 59 స్థానాల్లో 627 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో 2.15 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
  4. నేడు ఒకే విడుతలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల పొలింగ్‌ జరుగనుంది. పంజాబ్‌లోని 117 అసెంబ్లీ స్థానాలలో పొలింగ్‌ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. 93 మంది మహిళలు సహా 1,304 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు.
  5. నేడు కడప, విశాఖపట్నం జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కడపకు సీఎం జగన్‌ చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన పుష్పగిరి విట్రియో రెటీనా ఐ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం డిప్యూటీ సీఎం అంజద్‌ బాసా కుమార్తె పెళ్లి వేడుకలకు జగన్‌ హజరవుతారు.
  6. నేడు భారత్‌ వెస్టిండీస్‌ మధ్య మూడో టీ20 మ్యాచ్‌ జరుగనుంది. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే 2-0తో సిరీస్‌ను భారత్‌ కైవసం చేసుకుంది.
Exit mobile version