Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ యూపీ, గోవా లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అటు ఉత్తరాఖండ్ లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  2. నేడు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10.30కి హైకోర్టు సీజే కొత్త జడ్డీలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
  3. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ. 67,400లుగా ఉంది.
  4. నేడు రోడ్లు, భవనాలశాఖపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రోడ్ల నిర్మాణం, కొత్త ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్షించనున్నారు. నైట్‌ కర్ఫ్యూ సడలింపులపై చర్చించనున్నారు.
  5. నేడు మణిపూర్‌లో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభల్లో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొననున్నారు.
  6. నేడు యూపీ, పంజాబ్‌లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 12 గంటలకు అక్బర్‌పూర్‌లో మోడీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.45 గంటలకు జలంధర్‌లో మోడీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.
Exit mobile version