Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు రెండో రోజు ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం బెంగుళూరులో జరుగనుంది. నిన్న వేలంలోకి అన్ని విభాగాల్లోని 96 మంది క్రికెటర్లు వచ్చారు. అయితే 96 మందికి 74 మందిని ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి. మరో 22 మంది కొనుగోలుకు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపలేదు. ఫ్రాంచైజీల వద్ద మొత్తం 107 మంది ఆటగాళ్లు ఉన్నారు.
  2. నేడు ఏపీలోని విశాఖపట్నంలోని విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ సమితి జైల్‌భరో కార్యక్రమాన్ని చేపట్టనుంది. స్టీల్‌ ప్లాంట్‌ నుంచి కార్మికులు ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఈ జైల్‌భరోకు కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.
  3. నేటి నుంచి మత్స్యకార అభ్యున్నతి యాత్రను జనసేన పార్టీ నేతలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన నేతలు పర్యటించనున్నారు. 20న మత్స్యకార అభ్యున్నతి సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్ పాల్గొననున్నారు. మత్స్యకారుల ఉపాధి దెబ్బతీస్తున్న జీవో 217ను రద్దు చేయాలని జనసేన డిమాండ్‌ చేస్తోంది.
  4. నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రానున్నారు. సాయంత్రం ముచ్చింతల్‌కు రాష్ట్రపతి కోవింద్ విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు.
Exit mobile version