Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. దేశంలో 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపూర్‌, గోవాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు తెలియనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్‌ జరుగనుంది.
  2. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,300 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,800లుగా ఉంది. అలాగే కిలో వెండి రూ.76,700లుగా ఉంది.
  3. నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.
  4. పోలాండ్‌ నుంచి నేడు భారత్‌ సుమీ బృందం రానుంది. వార్‌ కారణంగా వారం క్రితం చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురానున్నారు.
  5. నేడు కేఈఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు హజరుకానున్నారు. ఈ సమావేశం వర్చువల్‌గా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ నీటి కేటాయింపులపై చర్చించనున్నారు.
  6. నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఏపీ మాజీ సీఎం రోశయ్య మృతికి నేడు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయనున్నారు. అంతేకాకుండా నేడు హిందూధార్మిక చట్టంలో సవరణ, ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు పెంపు, మద్యం అమ్మకాల చట్టంలో సవరణలకు సంబంధించిన మూడు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
  7. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర కేసు నిందితులకు నేడు రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగనుంది.
Exit mobile version