Site icon NTV Telugu

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

  1. నేడు పోలవరంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌, ఏపీ సీఎం జగన్‌లు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్ట్‌, పునరావాస కాలనీలను పరిశీలించనున్నారు.
  2. నేడు భారత్‌-శ్రీలంక మధ్య తొలి టెస్ట్‌ జరుగనుంది. మొహాలీ వేదికగా ఉదయం 9.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.
  3. న్యూజిలాండ్‌లో నేటి నుంచి మహిళల ప్రపంచకప్‌ జరుగనుంది. తొలి మ్యాచ్‌ న్యూజిలాండ్‌తో వెస్టిండీస్‌ తలపడనుంది.
  4. నేడు జార్ఖండ్‌కు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. గాల్వాన్‌ వ్యాలీలో చనిపోయిన అమరజవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందజేయనున్నారు.
  5. నేటి నుంచి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి వార్షిక బ్రహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 11న స్వామి వారికి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

Exit mobile version