నేడు ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించే ఛాన్స్ ఉంది. అయితే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.
నేటి నుంచి ఈ నెల 30 వరకు ట్రాఫిక్ చలాన్ల రాయితీల అమలు జరుగనుంది. తెలంగాణ ఈ చలాన్ వెబ్‌సైట్‌లో చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించనున్నారు.
నేడు శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శైవ ఆలయాలు దేదీప్యమానంగా విద్యుత్ కాంతుల అలంకరణతో మెరిసిపోతున్నాయి. మహాశివరాత్రిని పురస్కరించుకొని శైవ క్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాత్రి లింగోద్భవ ఘట్టాన్ని కన్నుల పండువగా నిర్వహించనున్నారు.
శ్రీశైలంలో నేడు 8వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు.