NTV Telugu Site icon

భూకంపం తరువాత కెరటాలు లేకుండా ఉప్పాడ సముద్రం… ఆందోళనలో మ‌త్స్య‌కారులు…

స‌ముద్ర‌తీరంలో అల‌లు ఎలా విరుచుకుప‌డుతుంటాయో చెప్ప‌క్క‌ర్లేదు.  మామూలు స‌మ‌యాల్లో కూడా అల‌లు పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతుంటాయి.  ముఖ్యంగా తూర్పుగోదావ‌రి జిల్లా ఉప్పాడ‌, విశాఖ జిల్లా భీమిలి,  శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంతాల్లోని స‌ముద్ర‌పు అల‌లు పెద్ద ఎత్తున విరుచుకుప‌డుతుంటాయి.  అయితే, మంగ‌ళ‌వారం రోజున రాజోలు నుంచి స‌ముద్రంలోని 156 కిమీ దూరంలో భూకంపం సంభ‌వించింది.  ఈ భూకంపం తీవ్ర‌త 5.1 గా న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  ఈ భూకంపం త‌రువాత స‌ముద్రంలో స‌డెన్‌గా మార్పులు క‌నిపించాయి.  ఎప్పుడు అల‌ల‌తో నిండిపోయే ఉప్పాడ తీరంలోని స‌ముద్రం అల‌లు క‌నిపించ‌డం లేదు.  స‌ముద్రం చాలా ప్ర‌శాంతంగా మారిపోయింది.  దీంతో తీరంలోని మ‌త్స్య‌కారులు ఆందోళ‌న‌లు చెందుతున్నారు.  స‌ముద్రంలో ఏదో జ‌రుగుతుంద‌ని, ఉప్పాడ తీరంలోని స‌ముద్రం ఇలా ఇప్పుడు చూడ‌లేద‌ని భ‌య‌ప‌డుతున్నారు.  కొన్ని రోజులు చేప‌ల వేట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని ఇప్ప‌టికే అధికారులు హెచ్చ‌రించారు.  

Read: ఆ జంతువుతో మహిళ ప్రేమాయణం… విల‌న్‌గా మారిన జూ సిబ్బంది…