NTV Telugu Site icon

కోరిక తీర్చాలంటూ మహిళా ఉద్యోగిని వేధించిన సబ్‌ రిజిస్ట్రార్‌

నేటి సమాజంలో ఎక్కడ చూసిన మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులు మాత్రం మారడం లేదు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్‌ గా విధులు నిర్వహిస్తున్న జయరాజు తన సహోద్యోగి మహిళను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఈ మేరకు సదరు మహిళా ఉద్యోగి దిశా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. రిజిస్టార్ ఆఫీస్‌లోని ఆడిట్ సెక్షన్లో అటెండర్ గా పనిచేస్తున్న మహిళను రిజిస్ట్రార్‌ జయరాజు తన కోరిక తీర్చాలంటూ వేధింపులకు గురిచేసేవాడు.

దీంతో ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఉన్నతాధికారులు కూడా జయరాజ్‌ను మందలించారు. అయినప్పటికీ జయరాజ్‌ సదరు మహిళను కోరిక తీర్చాలంటూ.. లేకుంటే చంపేస్తానంటూ బెదిరింపులకు దిగడంతో ఉన్నతాధికారలు సూచనల మేరకు పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.