NTV Telugu Site icon

Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖలో అపూర్వ స్వాగతం.. మంగళ వాయిద్యాలు, పూల వర్షం

Vande Bharat Express

Vande Bharat Express

Vande Bharat Express: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కల నెరవేరింది.. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి బయల్దేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖలో అపూర్వ స్వాగతం లభించింది.. రాత్రి 10.45 గంటలకు విశాఖ రైల్వేస్టేషన్ కు చేరుకుంది ఈ ప్రత్యేక రైలు.. జాతీయ జెండాలు, మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు రైల్వే అధికారులు.. వందేభారత్ రైలుపై పూల వర్షం కురిపించారు భారతీయ జనతా పార్టీ నేతులు, కార్యకర్తలు.. ఇక, ఈ ట్రైన్ లో అనకాపల్లి నుంచి విశాఖ వరకు ప్రయాణించారు ఎంపీ సత్యవతి.. కాగా, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం పట్టాలెక్కింది. సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు.

Read Also: Kothapeta Prabhala Utsavam: కన్నుల పండువగా ప్రభల ఉత్సవం..

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అంతకుముందు రైల్వే శాఖ మంత్రి అశ్వి ని వైష్ణవ్, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సికింద్రాబాద్ రైల్వేస్టేషస్టేన్‌ను పరిశీలించారు.. ఆ తర్వాత వందేభారత్ రైలులోకి వెళ్లి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. కాగా, వందేభారత్ రైలులో 16 బోగీలు ఉంటాయి. అందులో 14 చైర్ కార్ బోగీలు, మరో రెండు ఎగ్జీక్యూ గ్జీ టీవ్ చైర్కార్ బోగీలుంటాయి. మొత్తంగా రైలులో 1128 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది..