బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం మరో అల్పపీడనం ఏర్పడనున్నదని, దాని ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో పలు జిల్లాల్లో 4 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడనం రెండు రోజుల్లో బలపడి ఈ నెల 15 న మధ్య తూర్పు బంగాళాఖాతం తీరాన్ని సమీపిస్తుందని, దీని ప్రభావంతో చెన్నై పరిసర ప్రాంతాల్లో వచ్చే రెండు రోజులపాటు ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మధ్య తూర్పు బంగాళాఖాతం దాని సమీపంలోని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది. ఇక అటు తమిళనాడు లోని చెన్నై లోనూ భారీ వర్షాలు పడే చాన్స్ ఉన్నట్లు స్పష్టం చేసింది.
మరో అల్పపీడనం : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు
