ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీద ఉన్న తుఫాన్ జవాద్, ఉత్తర వ్యాయువ్య దిశగా గత 6 గంటల్లో గంటకు 6 కిమీ వేగంతో ప్రయాణించి.. ఈ రోజు డిసెంబర్ 2 వ తేదీ 8 గంటల 30 నిమిషాలకు తూర్పు రేఖాంశం వద్ద కేంద్రీకృతమై.. విశాఖ కు తూర్పు ఆగ్నేయంగా 210 కిమీ దూరంలో ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే.. ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా ఏపీకి వర్షాలు ఉన్నట్లు తెలిపింది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈ రోజు ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో కురిసే అవకాశం ఉంది.
రేపు మరియు ఎల్లుండి తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు , తేలికపాటినుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్లకురిసే అవకాశముంది. రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడిగా ఉంటుంది.
రాయలసీమ : ఈరోజు,రేపు మరియు ఎల్లుండి వాతావరణం పొడి గా ఉంటుంది.
