ఏపీ అసెంబ్లీలో రాజధానుల బిల్లును వెనక్కు తీసుకోవడం పై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను ఉల్లం ఘించి నాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.రాజధాని ప్రాం తం అంటే నాకు ఎలాంటి వ్యతిరేకత లేదన్నారు. నా ఇల్లు ఇక్క డే ఉంది.. ఈ ప్రాంతం అంటే నాకు ప్రేమ ఉందిరాజధాని అటు విజయ వాడ కాదు.. ఇటు గుంటూరు కాదు. ఈ ప్రాంతంలో కనీస వస తుల కల్పనకే లక్షల కోట్లు అవుతాయన్నారు. ఈ రోజు లక్ష కోట్లు పదేళ్లకు రూ.6 లక్షల కోట్లు అవుతుందన్నారు. గత ప్రభుత్వ లెక్కల ప్రకారమే మౌలిక వసతుల కల్పనకు లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని అలాంటప్పుడు మన పిల్లకు పెద్ద నగరాన్ని ఎప్పుడు అందిస్తామని, ఉద్యోగాలు ఎలా కల్పిస్తామని జగన్ అన్నారు. రాష్ట్రం లో అతిపెద్ద సిటీ విశాఖపట్నం.. అన్ని వసతులు ఉన్న నగరం విశా ఖ కొద్దిగా మౌలిక వసతులు వెచ్చిస్తే హైదరాబాద్ లాంటి నగరంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఏ ఒక్క ప్రాంతానికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే మూడు రాజధానుల బిల్లును తెరపైకి తీసుకువచ్చాం కానీ, ఈ బిల్లుకు ఆదినుంచి వ్యతిరేకత వ్యక్తం అవు తునే ఉంది. పైగా ప్రతిపక్ష పార్టీలు అన్ని బిల్లును వ్యతిరేకిస్తూ కోర్టు కేసుల చూట్టు ప్రభుత్వం తిరాగాల్సి రావడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వస్తోందని జగన్ తెలిపారు.
గతంలో ఉన్న మూడు రాజధానులకు సంబంధించిన చరిత్రను బుగ్గన సుదీర్ఘంగా చెప్పారన్నారు. ఆంధ్ర రాష్ర్టానికి రాజధానిగా కర్నూలు ఉండేది. గుంటురూలో హైకోర్టు ఉండేది. ఆ తర్వాత రెండు హైదరాబాద్‌కు తీసుకుని వెళ్లారు. అక్కడి ప్రజలకు వారి ఆకాంక్షలకు అనుగుణంగా శ్రీబాగ్ ఒడంబడిక జరిగింది. ఇప్పుడున్న మూడు రాజ ధానుల చట్టాన్ని వెనక్కు తీసుకుని మరో కొత్త చట్టంతో ముందుకు వస్తామన్నారు. ఇప్పుడు తీసుకు వచ్చే బిల్లును మరింత మెరుగు పర్చేందుకు కృషి చేస్తాం. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే బిల్లును తీసుకొచ్చాం.చట్ట పరంగా కొన్ని న్యాయ సంబంధమైన చిక్కులు ఉన్నాయి.
ప్రభుత్వం ప్రవేశపెట్టి మూడు రాజధానుల బిల్లును గతంలో అసెంబ్లీలో ఆమోదం పొందిన శాసన మండలిలో సెలెక్టు కమిటీకి పంపించాలని చెప్పడం. రేపు న్యాయ సమీక్షకు వస్తే బిల్లు ఎంత వరకునిలబడతాయనేది ప్రశ్న వస్తుంది. అందుకోసం రేపు హైకోర్టు ముందుకు వెళ్లితే ఈ బిల్లులు వీగిపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఈ తప్పును ముందే గుర్తించి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ మూడు రాజధానుల బిల్లుకు స్వల్ప విరామం మాత్రమేనని జగన్ తెలిపారు. కొత్త బిల్లులో ఎలాంటి లోపం లేకుండా మూడు రాజధా నుల బిల్లులను అందరి ఆమోదం పొందేలా తీసుకొస్తామని జగన్ తెలిపారు.
