రైతులను వదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. శుక్రవారం గుంటూరులోని ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటిలోని అగ్రిటెక్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ క్రాప్ ద్వారా నల్లతామర పురుగుతో దెబ్బతిన్న మిర్చిపంటపై నివేదిక తెప్పిస్తామన్నారు.
Read Also: రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు పై ఎన్జీటీ కీలక తీర్పు
వ్యవసాయ, ఉద్యానశాఖ వీసీలతో పాటు సైంటిస్టులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. నల్ల తామర పురుగు బారిన పడిన మిర్చి పంటను ఎలా కాపాడుకోవాలనే దానిపై దృష్టిపెట్టామని మంత్రి తెలిపారు. వ్యవసాయంలో సాంకేతికతను రైతులు వినియోగించాలన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా తమ ప్రభుత్వం రైతులను వదిలేయమని రైతుల అభివృద్ధికోసం ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి అన్నారు.
