NTV Telugu Site icon

మంచినీళ్ల కుళాయి వద్ద ఘర్షణ.. కత్తులతో యుద్ధం!

మంచినీటి కుళాయి విషయంలో చెలరేగిన వివాదం కత్తులతో యుద్ధం చేసేదాకా వెళ్లిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకొంది. జిల్లాలోని బూర్జ మండలం ఉప్పినవలస గ్రామంలోని పాతరెల్లివీధిలో మంచి నీటి విషయంలో చెలరేగిన గొడవతో కత్తులతో రెచ్చిపోయింది ఓ వర్గం. నాలుగు రోజుల క్రితం మంచినీటి కుళాయి వద్ద ఇద్దరు యువకులు కత్తులతో వీరంగం సృష్టించారు. తమ కుటుంబసభ్యులు తప్ప వేరే ఎవరూ నీరు పట్టుకోకూడదని ఆ యువకులు బెదిరించారు. కాగా, మరోమారు మంచినీటి కుళాయి వద్ద ఇరువర్గాలు గొడవకు దిగారు. ఓ వర్గం కత్తులతో దాడికి తెగబడటంతో నలుగురికి తీవ్రగాయాలైయ్యాయి. అనంతరం వారిని శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.