Vizianagaram: విజయనగరం జిల్లాలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.. దీంతో, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.. విజయనగరం రైల్వే స్టేషన్ సమీపంలో సంతకాల బ్రిడ్జి వద్ద పట్టాలు తప్పింది గూడ్స్ రైలు.. గూడ్స్ నుంచి మూడు వ్యాగన్లు విడిపోయాయి.. దీంతో, రైళ్లు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో.. రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారు.. సాంకేతిక సమస్య కారణంగానే గూడ్స్ రైలు పట్టాలు తప్పినట్లు నిర్ధారణకు వచ్చారు.. పునరుద్ధరణ పనులు చేపట్టిన రైల్వే అధికారులు.. ట్రాక్ క్లియర్ చేసి.. రైళ్ల రాకపోకలను పునరుద్దరించారు.. దీంతో, విజయనగరం రూట్‌లో రైళ్ల రాకపోకలు యథావిథిగా కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు చెబుతున్నారు.. అయితే, ఆ సమయంలో ఆ ట్రాక్‌పై ఎలాంటి రైళ్లు రాకపోవడంతో భారీ ప్రమాదం తప్పినట్టు అయ్యింది..
Read Also: Mohan Bhagwat: 75 ఏళ్ల రిటైర్మెంట్‌పై మోహన్ భాగవత్ సంచలన వ్యాఖ్యలు
