CM Chandrababu: ఒక్కప్పుడు పండగ చేసుకోవడం అంటే భయం.. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు.. ఒకటో తారీఖునే పెన్షన్ వస్తోంది.. ఇది కూటమి ప్రభుత్వం సత్తా.. మరే ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయనగరం జిల్లా దత్తిలో పర్యటించిన ఆయన.. లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఆర్థిక భరోసా కల్పిస్తున్నాం.. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందిస్తున్నాం అన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా 63 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం.. గతంలో ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే పెన్షన్ కట్ అయిపోయేది… ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.. మూడు నెలలు వరకూ చూస్తున్నాం.. మీరు మట్టి పనులకు వెళ్లినా అక్కడికే వచ్చి పెన్షన్ ఇస్తున్నాం అన్నారు.. ఫించన్లు ఇంచిందే టీడీపీ ప్రభుత్వమని గుర్తుచేసిన ఆయన.. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి.. ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా పెన్షన్ ఇస్తున్నాం.. ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పెన్షన్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది… మరే ఇతర రాష్ట్రం ఇలా ఇవ్వడం లేదన్నారు..
ఇక, ఆర్హులైన వారికి పించన్లు, తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాది అని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు.. పిల్లల అద్భుతమైన భవిష్యత్తు కోసం పెట్టిబడి పెట్టాలన్నారు.. దీపం పథకం ద్వరా సిరెండ్లు ఇచ్చింది మన ప్రభుత్వం ఇస్తోంది.. రెండు కోట్ల అరవై రెండు లక్షల సిలెండర్లు ఇచ్చాం.. స్ర్తీ శక్తి ద్వారా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లవచ్చు.. పది కోట్ల ప్రయాణాలు చేస్తున్నారు.. అనవసరంగా ప్రయాణం చెయ్యకండి.. దేవాలయం, చదూవుకు, ఉద్యోగాలకు వెళ్లండి అని సూచించారు.. నెలకు రెండు వందల నలభై ఏడు కోట్లు అవుతుంది.. సంవత్సరానికి రెండు వేల తొమ్మిది వందల అరవై మూడు కోట్లు అవుతుంది.. ఈ నెల నాలుగో తారీఖున పది హేను వేల రూపాయలు ఆటోడ్రైవర్లకు అకౌంట్‌లో వేస్తున్నాం అన్నారు చంద్రబాబు.
నేను వచ్చాక విద్యుత్ ఛార్జీలు పెచ్చమని చెప్పాం.. కానీ, ఇప్పుడు ట్రూ ఆప్ ఛార్జీలను తగ్గించాం అని వెల్లడించారు చంద్రబాబు.. సోలార్ మూడు కిలోవాట్ల వరకు 98 వేలు సబ్సిడీ ఇస్తున్నాం.. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్లు పెట్టి రెండేళ్లలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ను కాపాడాం.. పదకుండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పించాం.. విశాఖపట్నంలో రైల్వే జోన్ తెచ్చాం.. ఆర్సీసీఅర్ ఒక కోటీ నలబై లక్షలతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాం.. విశాఖపట్నం ఐటీ క్యాపిటల్ గా మారతోంది అని వెల్లడించారు సీఎం చంద్రబాబు నాయుడు..
