NTV Telugu Site icon

Poornananda Swamy: బాలికపై లైంగిక వేధింపుల కేసులో పూర్ణానంద అరెస్ట్

Poornananda Swamy

Poornananda Swamy

Vizag Poornananda Swamy Arrested In Molestation Case: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ పూర్ణానంద స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్వామిపై పొక్సో యాక్ట్ కింద దిశ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంతో ఆ స్వామి నడుపుతున్న జ్ఞానానంద రామానంద ఆశ్రమం వివాదంలో చిక్కుకుంది. వైజాగ్‌లోని వెంకోజిపాలెం వద్ద ఉన్న జ్ఞానానంద ఆశ్రమంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంటున్న తనపై రెండేళ్ల నుంచి పూర్ణానంద స్వామి లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని, ఓ పనిమనిషి సహకారంతో ఆ ఆశ్రమం నుంచి బయటపడ్డానని బాధిత బాలిక ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. దిశ పోలీసులు రంగంలోకి దిగి, కీచక స్వామిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. ఆశ్రమంలో రాత్రి తనిఖీలు నిర్వహించారు. తమకు కొన్ని ప్రాథమిక ఆధారాలు లభించాయని దిశ ఏసీపీ వివేకానంద తెలిపారు. ప్రస్తుతం దిశ పోలీస్ స్టేషన్‌లో పూర్ణానంద స్వామి ఉన్నారు.

PM Modi: అమెరికా పర్యటన ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుంది..

అయితే.. పూర్ణానంద స్వామి వాదన మాత్రం మరోలా ఉంది. ఈ ఆరోపణల్ని ఖండించిన ఆయన.. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ‘‘జ్ఞానానంద ఆశ్రమ భూములను కొట్టేయాలని కొందరు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ కుట్ర జరిగింది. దీనిపై నేను న్యాయ పోరాటం చేస్తాను. సింహాచల దేవస్థానం తప్పు చేస్తోందని ఫిర్యాదు చేస్తే.. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ.. నాపై, ఆశ్రమంపై కక్ష కట్టి ఇలా చేస్తున్నారు. ఒకప్పుడు ఆశ్రమంలో 1500 మంది పిల్లలు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 12 మంది మాత్రమే ఉంటున్నారు. ఆధ్యాత్మిక సేవ చేస్తుంటే అడ్డుకుంటున్నారు. ఆ బాలికను మచ్చిక చేసుకుని, ఈ ఫిర్యాదు చేయించారు’’ అంటూ పూర్ణానంద స్వామి చెప్పుకొచ్చారు. కాగా.. బాధిత బాలిక రాజమండ్రికి సమీపంలోని గండేపల్లికి చెందినదిగా గుర్తించారు. ఒక ట్రైన్ ఎక్కి వెళ్తుండగా.. ఓ కుటుంబం ఆమెని ఆదుకొని, పూర్ణానంద లీలలు బయటపడేలా చేశారు. పోలీసుల విచారణలో.. ఆ ఆశ్రమంలో సేవల పేరుతో బాలికల చేత వెట్టిచాకిరి చేయిస్తున్నట్టు తేలింది.

Chittoor Crime: దారుణం.. వరుసకి కొడుకు, సహజీవనం చేయాలంటూ..

Show comments