విశాఖ మన్యం ధారకొండ ఘాట్ రోడ్డులో దొంగతనాలు చేస్తున్న ముఠా గుట్టురట్టయింది. విశాఖ గ్రామీణ జిల్లా పోలీసులు ముఠాను అరెస్ట్ వారి వద్ద నుంచి కారు , మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . దీనికి సంబందించి గూడెం కొత్తవీధి సీఐ అశోకుమార్ వివరాలు అందచేశారు.
విశాఖ గ్రామీణ జిల్లా ఎస్పీ బి . కృష్ణారావు ఆదేశాలు మేరకు చింతపల్లి ఎఎస్పీ తుషారూదీ , సీసీఎస్ డీఎస్పీ డీఎస్ఆర్ఎఎస్ఎన్ మూర్తి ఆధ్వర్యంలో జీకేవీధి సీఐ అశోకకుమార్ , సీలేరు ఎస్సై రంజిత్ , సీసీఎస్ ఎస్సై హిమగిరిలు సారధ్యంలో నాలుగు బృందాలు గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతీయులను భయాందోళనకు గురిచేస్తున్న గూడెం కొత్తవీధి మండలం ధారకొండ ఘాట్ రోడ్డులో జరుగుతున్న దారిదోపిడీలను అరికట్టడానికి గాలింపు చర్యలు చేపట్టారు.
సోమవారం తెల్లవారుజామున ఘాట్ రోడ్డులో అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా గత నెల 23 న సప్పర్ల రెయినేజ్ వద్ద కారును అపహరించిన ఘటనలో కీలకనిందితులుగా ఉన్నట్లు సీఐ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా కలిమెల బ్లాక్ ఎంవీ 79 పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంపీపీ -65 గ్రామానికి చెందిన నీలకంఠ బిశ్వాస్ ( 21 ) , హరేన్ బిశ్వాస్ ( 26 ) , ఎంపీవీ -41 గ్రామానికి చెందిన సుశాంతాయ్ ( 22 ) , ఎంపీనీ -73 గ్రామానికి చెందిన మహేష్ సర్కార్ ( 21 ) లు ఉన్నారు. ముగ్గురు పరారీలో ఉన్నారని సీఐ అశోక కుమార్ తెలిపారు. దొంగల నుంచి ఎరుపు రంగు హుండా వెన్యూ కారు. సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.
