NTV Telugu Site icon

Vizag Steel Plant: స్టీల్ ప్లాంట్ ఇంచార్జ్ సీఎండీతో కార్మిక సంఘాల నేతలు భేటీ..

Vizag

Vizag

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ అరుణ్ కాంత్ భగ్చితో కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఇటీవల ఢిల్లీలో స్టీల్ మంత్రిత్వ శాఖలో జరిగిన సమావేశాల వివరాలను కార్మిక సంఘాలతో అధికారులు చర్చించారు. విశాఖ ఉక్కును మూసివేయాలనే ఆలోచన ఏదీ కేంద్ర ప్రభుత్వం దగ్గర లేదు అని వారు తెలిపారు. షట్ డౌన్ అయిన బ్లాస్ట్ ఫర్నేస్ -1ను అక్టోబర్ 2వ వారంలోపు పునరుద్ధరించి ఉత్పత్తి ప్రారంభిస్తాం అని అధికారులు పేర్కొన్నారు.

Read Also: Ashok Galla: అశోక్ గల్లా హీరోగా రొమాంటిక్‌ కామెడీ డ్రామా.. క్లాప్ కొట్టిన నమ్రత

అలాగే, స్టీల్ ప్లాంట్ కు నిధులు రాబోతున్నాయి.. ఇప్పటికే 500 కోట్ల రూపాయల నిధులు అయ్యాయని స్టీల్ ప్లాంట్ ఇంఛార్జ్ సీఎండీ కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఎంత మేరకు నిధుల విడుదల చేస్తారు.. రా మెటీరియల్ లభ్యతకు అనుసరించే మార్గాలపై స్టీల్ మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కారం కోసం చర్చలు జరుపుతోంది అని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతలతో స్టీల్ ప్లాంట్ ఇంచార్జ్ సీఎండీ అరుణ్ కాంత్ బగ్చి చెప్పుకొచ్చారు.