Site icon NTV Telugu

Vishnu Kumar Raju: ‘ఆల్కహాల్ గన్’ చూపిస్తూ జగన్‌పై విష్ణుకుమార్‌ రాజు హాట్‌ కామెంట్స్..

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇజ్రాయిల్ నుంచి తెచ్చినట్లు పేర్కొన్న ‘ఆల్కహాల్ గన్’ను చూపిస్తూ.. తాజాగా వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. జగన్ చుట్టూ ఉన్న కొందరు సలహాదారుల మాటలు విని తన స్థాయిని తగ్గించుకోవద్దని విష్ణుకుమార్ రాజు సూచించారు. ఇలాంటి విచిత్ర ఆలోచనలు కలిగిన అడ్వైజర్ల ప్రభావం వల్లనే తప్పుదారులు పడుతున్నారని విమర్శించారు.

Read Also: Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..

ఇక, వైఎస్‌ జగన్ పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద ఆటంకంగా మారిందని ఆరోపించారు విష్ణుకుమార్‌ రాజు… ముఖ్యంగా అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులను అనేక ఇబ్బందులకు గురిచేశారని పేర్కొన్నారు. అమరావతి రాజధానికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు తీసుకువచ్చిన వారిపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. అలాంటి సూచనలు చేస్తున్న అడ్వైజర్లకు సాధారణ జ్ఞానం ఉందా అని ప్రశ్నించారు. మొత్తంగా, విష్ణుకుమార్ రాజు చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వేడి రేపాయి.

Exit mobile version