Site icon NTV Telugu

New Year warning: చట్టపరంగా న్యూ ఇయర్‌ను ఎంజాయ్ చేయండి.. హద్దు మీరితే సెంట్రల్‌ జైలే గతి.. సీపీ మాస్‌ వార్నింగ్..

Happy New Year

Happy New Year

New Year warning: న్యూ ఇయర్‌ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.. 2025కి బైబై చెప్పేసి.. 2026కి గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు.. అయితే, చట్టపరంగా న్యూ ఇయర్ ను ఎంజాయ్ చేయండి, హద్దు మీరితే విశాఖ సెంట్రల్ జైలే గతి అని మాస్ వార్నింగ్ ఇచ్చారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి.. న్యూ ఇయర్ ముసుగులో మత్తు సరఫరా చేసే ముఠాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు విశాఖ సీపీ.. న్యూ ఇయర్ వేడుకలను నిర్వహణకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని.. ఈవెంట్ ఆర్గనైజర్లకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.. న్యూ ఇయర్ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు.. పార్టీల్లో మత్తు కలిగించే పదార్ధాలు వాడకం నిషేధమని, కొత్త సంవత్సరం ముసుగులో నిబంధనలు అతిక్రమిస్తే జైల్లో ఊసలు లెక్కపెట్టాల్సిందేనన్నారు.. బస్సులు, రైళ్లు తనిఖీలు ముమ్మరంగా చేస్తున్నామని, ఇతర రాష్ట్రాల నుండి గంజాయి, డ్రగ్స్ రవాణా, సరఫరాపై ప్రత్యేక నిఘా పెడుతున్నామన్నారు. న్యూ ఇయర్ మాటునా ఎవరైనా మాదక ద్రవ్యాలు విక్రయించిన, సేవించిన వారందరిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి..

Read Also: Payal Rajput: శివాజీ వ్యాఖ్యలపై ‘పాయల్ రాజ్‌పుత్’ ఫైర్.. ఆ వ్యాఖ్యలు అసహనం తెప్పించాయంటూ..!

Exit mobile version