Site icon NTV Telugu

Vizag Temple Business: NTV ఎఫెక్ట్: నమూనా మందిరం నిర్వాహకుల బాగోతం బట్టబయలు

Vsp

Vsp

Vizag Temple Business: విశాఖపట్నంలోని అయోధ్యా రామ్ నమూనా మందిరం నిర్వాహకులకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. దేవుడి పేరుతో కమర్షియల్‌ గా వ్యాపారం చేస్తూ భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో విశాఖ పోలీసులు స్పందించి.. ఆ నమూనా మందిరం సెట్‌ను వెంటనే తొలగించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిర్వాహకులు నమూనా సెట్ కు సంబంధించిన సామాన్లను సర్థేసుకుంటున్నారు. కాగా, దేవుని పేరుతో జరుగుతున్న ఈ వ్యాపార బాగోతాన్ని ఎన్టీవీ తెలుగు వరుస కథనాల రూపంలో బహిర్గతం చేయడంతో.. ఈ కథనాల ప్రభావంతో నిర్వాహకుల అసలు రంగు బయటపడింది.

Read Also: Nara Rohith : నారావారి అబ్బాయ్ సినిమాకు ‘హాట్ స్టార్’ భారీ ప్రైజ్

ఇక, కోట్ల రూపాయలు వసూలు చేసిన నిర్వాహకులు, వాటిని పెట్టుబడుల పేరిట మోసం చేసినట్లు తాజాగా, వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా దుర్గాప్రసాద్ అనే నిర్వాహకుడు భారీగా పెట్టుబడులను సేకరించి, తిరిగి వాటిని చెల్లించకుండా మోసం చేశాడన్న ఆరోపణలు అనేకం వచ్చాయి. రిసెంట్ గా శ్రీ రామ కళ్యాణం పేరిట మరో భారీ దోపిడీకి స్కెచ్ వేసిన సమయంలోనే ఈ కుంభకోణం బయటపడింది. దీని ద్వారా భక్తులను నమ్మించి భారీగా వసూళ్ల చేసేందుకు యత్నించిన వ్యవహారం వెలుగు చూసింది. ప్రజల నమ్మకాన్ని దోచుకునే ఇలాంటి వారిని సంబంధిత అధికారులు కఠినంగా శిక్షించాలని హిందు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version