ముస్లింలు అత్యంత్య పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఈరోజు. ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ముస్లిమ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మోహన్ బాబు, ఎన్టీఆర్, మహేష్ బాబు ముస్లిం సోదరులను విష్ చేస్తూ ట్వీట్లు చేశారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను విడుదల చేశారు. అందులో బాలయ్య “అస్సలామ్ వాలేకుం… ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు. త్యాగానికి, సేవా నిరతికి మారుపేరు రంజాన్ పవిత్రమాసం. ఎంతో భక్తిశ్రద్ధలతో, కఠిన ఉపవాస దీక్ష ఉంటూ దైవాన్ని కొలవడం ఆదర్శప్రాయం. అల్లా కృపాకటాక్షాలతో ఈ రంజాన్ పర్వదినం మీ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ… మరొకసారి మీ అందరికీ నా రంజాన్ శుభాకాంక్షలు. మీ బాలకృష్ణ” అంటూ రంజాన్ శుభకాంక్షలు తెలియజేశారు బాలయ్య.
రంజాన్ శుభకాంక్షలు తెలిపిన బాలకృష్ణ
Show comments