Site icon NTV Telugu

JP Nadda: వైసీపీపై బీజేపీ చీఫ్ పరోక్ష విమర్శలు.. అవినీతి ప్రభుత్వాన్ని కూలదోసి కూటమికి అవకాశం ఇచ్చారు..

Nadda

Nadda

JP Nadda: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధికారంలోకి రాక ముందు అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం నడిచేది అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేడీ నడ్డా తెలిపారు. వైసీపీ అసమర్థత, అస్తవ్యస్తమైన ప్రభుత్వాన్ని కూలదోసి కూటమిని ఎంచుకున్నందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని ఆయన తెలిపారు. మిగిలిన రాజకీయ పార్టీలు మాదిరిగా ఏ ఎండకు ఆ గోడకు పడితే.. బీజేపీ సిద్ధాంతం మీద, కేడర్ మీద ఆధారపడుతోంది అని తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్ లో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని కేంద్రమంత్రి జేపీ నడ్డా చెప్పుకొచ్చారు.

Read Also: Om Birla: మహిళా శక్తితో ప్రపంచంలో ముఖ్య దేశంగా భారత్..

అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 హస్పటల్స్, 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని జేపీ నడ్డా పేర్కొన్నారు. రాజధాని అమరావతి కోసం 15 వేల కోట్ల రూపాయలు ఇచ్చాం, సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటైంది అన్నారు. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం ఒక డెత్ ట్రాప్.. అరాచక, అవినీతి పాలనతో అంధకారంలోకి నెట్టేసిన తీరును ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్ళాలి.. 15 నెలల కాలంలో రాష్ట్ర అభివృద్ధి, పునర్వైభవం కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని బలంగా తీసుకుని వెళ్ళాలి.. మోడీ గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది.. ఆంధ్రప్రదేశ్ గుండెల్లో మోడీ ఉన్నాడు అని జేపీ నడ్డా తెలియజేశారు.

Exit mobile version