Visakhapatnam: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (GVMC)లో కార్పొరేటర్ల ఫిరాయింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. 26 మంది కార్పొరేటర్ల ఫిరాయింపుతో మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమిపై వైసీపీ ఏప్రిల్ నెలలో రిటర్నింగ్ అధికారికి కంప్లైంట్ చేసింది. విప్‌ను ధిక్కరించారనే కారణంతో 26 మంది సభ్యులను అనర్హులుగా ప్రకటించాలని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
Read Also: IND vs PAK: ట్రోఫీకి అడుగు దూరంలో భారత్.. ఆశలన్నీ ఆ యువ ప్లేయర్ పైనే..
అయితే, ఈ ఫిర్యాదుపై విచారణ చేపట్టిన రిటర్నింగ్ అధికారి తాజాగా నిర్ణయం వెల్లడించారు. 80వ వార్డు కార్పొరేటర్ నీలిమ విప్ ధిక్కరణ పరిధిలోకి వస్తుందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆమె కార్పొరేటర్ సభ్యత్వంపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉంది. కాగా, మిగిలిన కార్పొరేటర్ల విషయంలో విప్ ధిక్కరణకు సంబంధించి నేరుగా నోటీసులు అందుకున్నట్లు ఆధారాలు లేవని రిటర్నింగ్ అధికారి చెప్పారు. దీంతో మిగిలిన సభ్యులపై వైసీపీ చేసిన ఫిర్యాదును తోసిపుచ్చారు. కాగా, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది.
