Visakhapatnam: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లైంగిక వేధింపుల బారిన పడి డిగ్రీ విద్యార్థి సాయి తేజ మృతి చెందడం కలకలం రేపుతుంది. ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ విద్యార్థి మృదేహానికి నేడు పోస్టుమార్టం చేయనున్నారు. సాయి తేజ మృతదేహాన్ని కింగ్ జార్జ్ ఆసుపత్రి (కేజీహెచ్)లో ఉంది. ఇక, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు మహిళా సిబ్బందిని కాలేజీ యాజమాన్యం తాత్కాలికంగా విధుల నుంచి సస్పెండ్ చేసింది. కాగా, ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Read Also: Israel-Gaza: ఖైదీల వీడియో లీక్.. ఇజ్రాయెల్ టాప్ అడ్వకేట్ జనరల్ మేజర్ రాజీనామా
మరోవైపు, ఈ ఘటనపై ఏంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి తేజ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈరోజు కాలేజీ దగ్గర విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టేందుకు పిలుపునిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాలేజీ వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
