Site icon NTV Telugu

Vizag Steel Plant: విశాఖ ఉక్కుపై గుడ్‌న్యూస్.. భారీ ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం

Modi

Modi

విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్‌న్యూస్  చెప్పింది. ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఫ్యాక్టరీకి కేంద్రం కొత్త జీవం పోసింది. పరిశ్రమ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ.11, 440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం అధికారికంగా వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశం ఈ ప్యాకేజీకి ఆమోదముద్ర వేసినట్లు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Viral Video: కారులో భార్య, ఆమె ప్రియుడు.. కారు బానెట్‌పై భర్త.. వైరల్ వీడియో..

కేంద్ర ప్యాకేజీపై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమ అభివృద్ధి కోసం రూ.11,440 కోట్లు కేటాయించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ప్యాకేజీ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. నష్టాలను అధిగమించేందుకు, ప్లాంట్‌ లాభాల బాట పట్టేందుకు కేంద్ర ప్యాకేజీ దోహద పడుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజల ఆకాంక్షల పట్ల కేంద్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.

Exit mobile version