NTV Telugu Site icon

Andhra to Andhra via Telangana: ఆంధ్రా to ఆంధ్రా వయా తెలంగాణ.. గళమెత్తిన కూటమిలోని మరో ఎమ్మెల్యే..!

Vishnu Kumar Raju

Vishnu Kumar Raju

Andhra to Andhra via Telangana: ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ.. ఇది విశాఖపట్నం వాసుల దుస్థితి అంటూ టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పెట్టిన పోస్టు హాట్‌ టాపిక్‌గా మారింది.. అది కాస్తా వైరల్‌గా మారడంతో.. గంటా వ్యవహారంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది.. ప్రభుత్వం మనదే, విమానయాన మంత్రి మనవారే.. వారి దృష్టికి తీసుకురావొచ్చు కదా? అని ప్రశ్నించింది.. అంతేకాదు, మరోసారి ఇలాంటివి రిపీట్‌ కావొద్దు అంటూ హెచ్చరించింది.. అయితే, ఆంధ్రా టూ ఆంధ్రా వయా తెలంగాణ అంటూ కూటమిలోని మరో ఎమ్మెల్యే గళం ఎత్తారు.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ ట్వీట్ తో ఏకీభవించారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు… ఉదయంపూట విజయవాడకు విమాన కనెక్టివిటీ లేదన్న ఆయన.. విజయవాడలో పార్టీ మీటింగ్ లు, ప్రభుత్వ అవసరాలకు వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు.. ఎమ్మెల్యేలను ముఖం మీద అడగలేకపోతున్నాయి.. కానీ, వ్యాపార వర్గాలు సహా అందరూ విశాఖను పూర్తిగా వదిలేశారని అభిప్రాయంతో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు..

Read Also: UP: మీరట్‌లో మరో దారుణం.. ప్రియుడి కోసం భర్తపై ‘స్నేక్’ అస్త్రం

అసలు, రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా వుండి కూడా ఈ దుస్థితి ఎందుకో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణుకుమార్‌ రాజు.. సమస్యను రామ్మోహన్ నాయుడు దృష్టికి తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు బీజేఎల్పీ నేత విష్ణుకుమార్ రాజు.. కాగా, ఆంధ్రా to ఆంధ్రా via తెలంగాణ అంటూ గంటా చేసిన ట్వీట్‌ కూటమిలో చర్చగా మారింది.. విపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయ్యింది.. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం అంటూ ఆవేదనతో ట్వీట్‌ చేశారు గంటా.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరి అక్కడినుంచి విజయవాడ విమానం క్యాచ్ చేసి గన్నవరం ఎయిర్ పోర్టులో దిగేసరికి మధ్యాహ్నం 1 గంట అయ్యింది.. సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సాయంత్రం సమావేశం కావడానికి విశాఖ నుంచి బయలుదేరిన సీఐఐ, ఫిక్కీ వంటి ట్రేడ్ ప్రతినిధులు కూడా నాలానే హైదరాబాద్ మీదుగా విజయవాడ చేరారు. విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో ఈ పరిస్థితి వచ్చింది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చింది. ఇది విశాఖ విమాన ప్రయాణీకుల దుస్థితి అంటూ గంటా శ్రీనివాసరావు చేసిన ట్వీట్‌ చర్చకు దారితీసిన విషయం విదితమే..