GVL Narasimha Rao: జర్నలిస్టుల అరెస్టులు, మీడియా సంస్థల్లో పోలీసుల తనిఖీలు చివరికి ప్రభుత్వ పతనానికి దారితీస్తాయని హెచ్చరించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్ట్, హైదరాబాద్‌లోని ఎన్టీవీ కార్యాలయంలో పోలీసుల సోదాలపై స్పందించిన ఆయన.. అధికారంలో ఉన్నవారికి అన్ని వార్తలు నచ్చకపోవచ్చు. అంత మాత్రాన జర్నలిస్టులను అరెస్టు చేస్తామంటూ బెదిరించే ప్రయత్నాలు చేయడం సరికాదని అన్నారు. ఇది మీడియాను భయపెట్టే ధోరణిలో భాగమేనని వ్యాఖ్యానించారు. ఇలాంటి వైఖరి ఏ రాష్ట్రంలోనూ సమర్థనీయమేమీ కాదని జీవీఎల్ స్పష్టం చేశారు. వార్తా కథనం అసత్యమని భావిస్తే సంబంధిత మీడియా సంస్థను వివరణ కోరవచ్చని, లేదా బ్రాడ్‌కాస్టింగ్ కౌన్సిల్ వద్ద ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అంతేగానీ పోలీసు బలాన్ని, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి మీడియాపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్యానికి హానికరమని తీవ్రంగా ఖండించారు బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు..
Read Also: Harish Rao: ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి మీడియాను సీఎం భయపెడుతున్నారు..
