Amit Shah Vizag Visit Cancelled: ఆంధ్రప్రదేశ్‌కి మరోసారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రావాల్సి ఉండగా.. చివరి గంటల్లో అమిత్‌షా విశాఖపట్నం పర్యటన రద్దయింది. విశాఖలో నిర్వహిస్తున్న సీఐఐ (CII) పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అమిత్ షా హాజరుకావాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలతో ఆయన పర్యటన రద్దయినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఇక, అమిత్ షా పర్యటన రద్దు కావడంతో సీఐఐ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌లో మార్పులు చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి పర్యటన రద్దయిన నేపథ్యంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సీఐఐ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన సమక్షంలో ప్రారంభోత్సవ కార్యక్రమం కొనసాగింది. అమిత్ షా పర్యటన రద్దు కావడం, కార్యక్రమంలో మార్పులు చోటుచేసుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
కాగా, ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రాత్రి INS డేగా విమానాశ్రయానికి చేరుకోవాల్సిఉంది.. ఇక, రేపు జరగనున్న అంటే గురువారం స్టార్ట్ కానున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని ముందు తెలిపారు.. ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి దాదాపు రెండు గంటల పాటు గడపాల్సి ఉండే.. అనంతరం మధ్యాహ్నం నిర్వహించనున్న ఉమెన్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌ను అమిత్ షా ప్రారంభించాల్సి ఉంది.. మహిళా అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకావాల్సి ఉంది.. అదేవిధంగా హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై కూడా అమిత్ షా కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందగా.. ఇప్పుడు అమిత్‌షా పర్యటన రద్దు చేసుకున్నారు..

