Amit Shah Vizag Visit: నేడు విశాఖకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రెండు కీలక సదస్సులకు శ్రీకారం

Amith Shah

Amith Shah

Amit Shah Vizag Visit: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు ఆయన రాత్రి INS డేగా విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఇక, రేపు జరగనున్న అంటే గురువారం స్టార్ట్‌ కానున్న పార్టనర్‌షిప్ సమ్మిట్ ప్రారంభ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సదస్సులో కేంద్ర హోంమంత్రి దాదాపు రెండు గంటల పాటు ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం నిర్వహించనున్న ఉమెన్ డెవలప్‌మెంట్ సమ్మిట్‌ను అమిత్ షా ప్రారంభించనున్నారు. మహిళా అభివృద్ధి, సాధికారతకు సంబంధించిన అంశాలపై నిర్వహించే ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

అదేవిధంగా హోం మంత్రిత్వ శాఖకు సంబంధించిన అంశాలపై కూడా అమిత్ షా కీలక సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ భేటీలో హోం శాఖకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇక, రేపు రాత్రి తన పర్యటన ముగించుకుని అమిత్ షా తిరిగి INS డేగా నుంచి బయలుదేరనున్నారు. సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్, ఉమెన్ డెవలప్‌మెంట్ సమ్మిట్ ప్రారంభోత్సవాల్లో కేంద్ర హోంమంత్రి పాల్గొననుండటంతో విశాఖలో పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.